Friday, July 18, 2008

ఉద్యమాలు కాదు, రాజ్యాంగ అవగాహన కావాలి !

గడిచిన యాభై ఏళ్లలో ఈ ఉద్యమాలే, ఈ పోరాటాలే , ఈ పనికిమాలిన మార్గాలే , కాలంచెల్లిన పద్దతులే మన బతుకులను చిద్రం చేసి, మనను నలుదిక్కుల తరిమి, వలస పోయేటట్లు చేసి , మన ఊళ్ళను స్మశానాలు చేసి , మన తెలంగాణను కాకులకు & గద్దలకు (పరాయి వాళ్లకు మరియు వలసవాదులకు) ఫలహారంగా పెట్టలేదా? ఇదే సమయంలో దేశంలోని మరియు రాష్ట్రంలోని మిగితా ప్రాంతాల ప్రజలు రాజ్యాంగం అందించిన హక్కులను , రాజకీయాలను, పరిపాలన యంత్రాంగాన్ని, న్యాయ వ్యవస్థను అవహగన చేసుకొని మరియు రాజకీయ నాయకులను ఉపయోగించుకొని అభివృద్ధి చేసుకొని బాగుపడ్డారు. మనం తెలంగానవాళ్ళం రోడ్డున పడ్డాం!

ఎవరో దిక్కుమాలిన పరాయి మేధావులు మరియు కొందరు దారి తప్పిన మన తెలంగాణా గారాల బిడ్డలు ఇంపోర్టెడ్ సిద్ధాంతాలతో, కూడు పెట్టని కుట్రలు కుతంత్రాలతో, అమాయక జనాలను అప్పుడే పరివర్తన చెందుతున్న మన పాత పరిపాలన వ్యవస్థ పై కి పురిగోలిపి, రాజ్యాంగాన్ని అవగాహన చేసుకోనివ్వకుండా రాజకీయాలకు పెడర్ధాలు చెప్పారు ! రాజకీయాల్లో పాల్గొని జనాలకు సేవ చేయాల్సిన యువకులను జనజీవనస్రవంతికి దూరంచేసి అడవిపాలు చేసినారు!!

ఈ నాటికీ తెలుగు వార్త పత్రికలు , వాటి చెత్త రాతలతో జనాన్ని, ముఖ్యముగా చదువుకున్న యువతని రాజకీయాల నుండి దూరం చేస్తున్నాయి మరియు రాజకీయాలు & పరిపాలన వ్యవస్థ అంటే అసహ్యం & చిదరింపు కలిగేలా చేస్తున్నాయి.

ఇకనయినా మనం నిజం ఏంటో తెలుసుకొని, దిక్కుమాలిని మన తెలంగాణా మేధావులు మాటలు వినకుండా, మరియు ఉద్యమాలను & పోరాటాలను అట్టక ఎక్కించి భారత రాజ్యాంగం అందించిన హక్కులను, రాజకీయాలను, పరిపాలన యంత్రాంగాన్ని మరియు న్యాయ వ్యవస్థను అవహగన చేసుకుందాం! రాజకీయ ప్రక్రియలో పాలుపంచుకొని, రాజకీయ నాయకులతో కలిసి పనిచేసి మరియు వారిని ఉపయోగించుకొని ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకుందాం!! మన బతుకుల్ని మనమే బాగుచేసుకుందాం!!!

జై తెలంగాణా! జై జై తెలంగాణా!!

ధన్యవాదాలతో మీ,
శ్రీధర్ రెడ్డి .పి

3 comments:

Naveen said...

I am moved by an article titled "development worker and love" which appeared in a monthly magazine - Livelihoods. The article goes on to say that Love is an activity which is about "giving without any reciprocal expectation". If one truly loves (husband's love to wife, mother's love to child, brother's love to sister) they do not expect anything in return and there lies the joy - the joy of giving.

Unfortunately our political leaders are not expecting joy of giving. They want joy of taking. So clearly, there is no love for telangana among them.

Love is characterised by four things: Care, Responsibility, Respect and Knowledge. Through his blog post, Mr Sridhar hints at the fourth characteristic - Knowledge.

We care for our land, we take responsibility for our land, we respect our land but if we do not have the right knowledge to do all of these, then we are doing only part of the job.

Let us earn the knowledge. I would appreciate if Mr Sridhar can take his time to educate the readers of this blog on some of the constitutional rights we as the citizens of Telangana have. I volunteer to provide my contribution to this initiative. Once we prepare some understanding, we can take this program to the people of Telangana as a program on Constitutional Awareness for Telangana Citizens. Comments invited.

Telangana Bathuku Baata said...
This comment has been removed by the author.
Telangana Bathuku Baata said...

ప్రజా సమస్యల నుండి ఉద్యమాలను, ఉద్యమాల నుండి రాజకీయ పార్టీలను మరియు రాజకీయ నాయకులను పుట్టించి, ఆ పార్టీలతో కొద్ది రోజుల్లోనే నిరాశ చెంది, ఒదగలేక, పొదగలేక మల్లీ ఇంకో ప్రజా సమస్యపై ఉద్యమం లేవదీసి పాత కథను పునరావృతం చేస్తున్నారు ఈనాటి ఉద్యమనాయకులు చాలమంది. అసలు ప్రజా సమస్యలకు పరిష్కారాలు సాదించకుండా ఉద్యమాలు & పోరాటాలూ దారి తప్పుతున్నాయి.

అరవై ఏళ్ళ క్రితం స్వతంత్ర పూర్వం ఉద్యమాలకు మరియు పోరాటాలకు ఉన్నంత ఆవశ్యకత మరియు అవసరం ఈనాటి స్వతంత్ర ప్రజాసామ్య భారతదేశంలో లేదు. ఆ రోజుల్లో మనం పరాయి రాచరిక పరిపాలనలో ఉన్నాం. ఈ రోజు మెజారిటీ ప్రజలు కోరుకున్న ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్నాం! కాని ఆనాటి ఉద్యమ పోరాట స్పూర్తి ప్రజాస్వామ్యంలో మనము పాల్గొనే ప్రతి వ్యవస్థ లో, సంస్థలో, ప్రతి పనిలో ఉండాలి!!

ఆనాటి 1969 ఉద్యమం, నక్సల్ బరి ఉద్యమం నుండి మొన్నటి మద్యనిషేదోద్యమం, బషీర్బాగ్ కరెంటు ఉద్యమం, బీడీ కార్మికుల ఉద్యమం నుండి ఈనాటి s.c వర్గీకరణ ఉద్యమం, భూపోరాటం, వ్యవసాయ మద్దతు ధరల ఉద్యమాల వరకు ఉద్యమాలు & పోరాటాలూ రాజకీయ రూపాంతరం చెంది ప్రజా సమస్యలను - అసలు సమస్యలను పరిష్కరించకుండా కనుమరుగు కాలేదా? అదికాక ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పొగుట్టుకొని, పనులు చెడగొట్టుకొని తమ కుటుంబాలను నాశనం చేసుకోలేదా?

ఇదంతా చెబుతూ నేను ప్రస్తుత రాజకీయాలకు క్లీన్ చిట్ ఏమి ఇవ్వడంలేదు! ప్రజాస్వామ్యంలో కూడా ఉద్యమాలకు కొంత తావు ఉంది అని నర్మదా భాచావ్ ఆందోళన్, Magsasay Awardee రాజేందర్ సింగ్ చేపట్టిన వాటర్ షెడ్ ఉద్యమం, RTI ఉద్యమం, బాబా అమ్టే ఉద్యమాల వంటి కొన్ని ఉద్యమాలు నిరూపించి ప్రజా సమస్యలకు రాజకీయాలు కూడా చూపలేని అద్భుత పరిష్కారాలను సాదించాయి!

ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయాలంటే సమస్యలను అవగాహన చేసుకొని రాజకీయాలకు & రాజకీయనాయకులకు దూరంగా వుంటూ, సమస్యను ఎదురుకుంటున్న జనానికి దగ్గరవుతూ రాజ్యాంగబద్ధ సంవస్థ లతో చర్చలుచేస్తూ, వాదోపవాదాలు చేస్తూ వీలైనంత వరకు ఓపికతో సమస్యలకు పరిష్కారాలు సాదించాలి. అంతేకాని పెద్ద పెద్ద రాజకీయనాయకులను చులకన చేసి మాట్లాడం, వారితో అనవసర శత్రుత్వం పెట్టుకోవడం, చిల్లర రాజకీయనాయకులకు ఉద్యమాలను వేదికలుగా మలచడం, ప్రభుత్వాదికారులతో అసభ్యంగా మాట్లాడుతూ పోట్లాడడం, సమస్యతో సంబందంలేని జనాలకు అసౌకర్యము కలిగించడం వగైరాలు మనము చేస్తున్న ప్రజా ఉద్యమాలకు ప్రతిబందకాలు!

మన పోలేపల్లి సెజ్ ఉద్యమం రాజకీయాలకు వేదిక కాకుండా & అనవసర దారులు తొక్కి రాజకీయ పార్టీల ద్వార co-opt కాబడకుండా ప్రజోపకార ఉద్యమంగా ముందుకు పోతూ అసలు భాదితులకు ఉపయోగాకారిగావుంటూ సమస్యలకు పరిష్కారాలు సాదిస్తుందని ఆశిస్తూ,

ధన్యవాదాలతో,
మీ శ్రేయోభిలాషి
శ్రీధర్ రెడ్డి పి